మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామ ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణాపై సమాచారం మేరకు బుధవారం నెల్లికుదురు తహసిల్దార్ రాజు తో పాటు ఆర్ ఐ సిబ్బందితో కలిసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులుపట్టుకున్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్ లో తాహసిల్దార్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ ఓనర్ యాకయ్య పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.