మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం రేకుల తండాలో గత ఐదు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పత్తి చేలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా పొద్దున పూట ఎండ, సాయంత్రం పూట వర్షానికి మొత్తం మొలక ఎత్తడం జరిగినది. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట చేతికి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పంటను గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు.