జనగామ కాంగ్రెస్ లో వర్గపోరు రాజుకుంటోంది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత కంచ రాములు పోలీసులకు, పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి రూ.25 లక్షలు సుపారీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా రాములు ఆరోపణలను కొమ్మురి ఖండించారు.