పాలకుర్తి మండలం గూడూరులో గత నెల 5వ తేదీ సాయంత్రం తండ్రి కొడుకులపై దాడి చేసిన సంఘటనలో రెండు రోజుల విచారణ చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కేసుతో పాటు పలు సెక్షన్లతో నిందితులను రిమాండ్ కు పంపినట్లు వర్ధన్నపేట ఏసిపి అంబాటి నర్సయ్య తెలిపారు. మేకలను వెళ్లగొట్టమన్నందుకు దాడి చేసిన నిందితులు నాయని భాస్కర్, మేకల ఎర్రయ్య అనే వ్యక్తులను పాలకుర్తి పోలీసులు అరెస్టు చేసినట్లు వివరించారు.