చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత, చేప పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై చేప పిల్లలను వదిలారు.