జిల్లా వ్యాప్తంగా వీస్తున్న ఈదురుగాలులు

59பார்த்தது
జనగాం జిల్లా వ్యాప్తంగా దుమ్ముదూళితో కూడిన ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారి మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీస్తుండడంతో రోడ్ల మీద చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పలు ప్రాంతాలకు చెందిన పలువురు తెలిపారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లవద్దని, దూర ప్రయాణాలు చేయవద్దని, గాలులకు తోడుగా రాళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు వివరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி