డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో ఆదివారం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కళ్యాణంలో గ్రామానికి చెందిన షేక్ సైదుస్సేన్- చాందుబీ అనే ముస్లిం దంపతులు పాల్గొన్నారు. సీతారాముల సేవలో ప్రతీ సంవత్సరం పాల్గొంటారని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ రాంప్రసాద్, మాజీ ఎంపీటీసీ నాగమణి- మధు సూదను రావు, గ్రామ ప్రజలు, యువత, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.