మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో సోమవారం గ్రామానికి చెందిన రామకృష్ణ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సు అక్కడే వదిలి పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.