భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామంలో రూ. 6లక్షలతో 60 సీసీ కెమెరాలను బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా దినదినాభివృద్ధి చెందుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.