జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ దాడులు జరిగాయి. పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో 20వేల రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ కార్యాలయ ఈఈ దిలీప్ కుమార్, ఏటిఓ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణిలుపట్టుబడ్డారు. మలహాల్ రావు మండలం తాడిచార్ల గ్రామానికి చెందిన సదానందం అనే రోడ్డు కాంట్రాక్టర్ కు పనిచేసిన బిల్లులు నాలుగు లక్షల రూపాయల బిల్లులు రావడం కోసం డబ్బులు డిమాండ్ చేసారని తెలిపారు.