లోక్‌సభలో గురువారం వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బిల్లు ఆమోదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో శాశ్వతమైన విభజనను తీసుకొచ్చేందుకే బీజేపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని, అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు సభలోకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఆగదంలోకి నెట్టుతున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.