స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది. అతను ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ మోకాలికి బ్యాండేజీ వేసుకుని ప్రాక్టీస్ చేశాడు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే, విరాట్ మోకాలికి బ్యాండేజీ వేసుకుని ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో కోహ్లీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.