అసంపూర్తి పనులతో ఇబ్బందుల్లో దుకాణదారులు

84பார்த்தது
అసంపూర్తి పనులతో ఇబ్బందుల్లో దుకాణదారులు
కొడంగల్ పట్టణంలోని తాండూర్ రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో 10 నెలల క్రితం అసంపూర్తిగా ఉన్న 6 దుకాణాలకు అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న దుకాణాలు ప్రస్తుతం అసంపూర్తిగా ఉండటంతో అధికారులపై వారు ఒత్తిడి చేశారు. కాగా మూడు రోజులుగా దుకాణాల ముందు నాసిరకంగా మెట్ల నిర్మాణం చేస్తుండగా దుకాణదారులు నిలదీశారు. ఆరు దుకాణాలకు మూడు మెట్లు, అవీ నాసిరకంగా నిర్మించడం ఏంటని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி