ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ఈ నెల 9న ఫార్మా బాధితులు, రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న ఉదయం కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి హకీమ్ పేట్, ఆర్బీ తండా, లగచర్ల, దుద్యాల, హస్నాబాద్, పర్సాపూర్ మీదుగా కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.