గాంధీ జయంతి రోజు బుధవారం మాంసం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు. శంకర్‌పల్లి మండలం సంకెపల్లికి చెందిన నాగేశ్ నవాబుపేట మండలం పూలపల్లి చౌరస్తాలో మాంసం అమ్ముతుండగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గాంధీ జయంతి రోజు మాంసం, మద్యం అమ్మకాలు నిషే ధం అని, నిబంధన అతిక్రమించడంతో కేసు నమోదు చేశామన్నారు.