హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిశారు. అనంతరం అర్చకులు సీఎంను ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయకం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.