BMW కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు యువతులు మృతి (వీడియో)

63பார்த்தது
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు యువతులను BMW కారు బలంగా ఢీకొట్టడంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగుచూసింది. ఇండోర్‌లో రాత్రి వేళ ఇద్దరు యువతులు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

தொடர்புடைய செய்தி