TG: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 10న అదృశ్యమైన ఇద్దరు వలస కార్మికులు, వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించరు. మృతులు బైద్యనాథ్ భట్ (UP), హరిసింగ్(ఒడిశా)గా పోలీసులు గుర్తించారు. పైడిగుమ్మల్‌లో వెంచర్ పనులకు వచ్చిన ఇద్దరు కార్మికులు ప్రమాదం బారిన పడ్డట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి వ్యవసాయ బావిలో నుంచి కార్మికుల మృతదేహాలు గుర్తించి, వెలికితీశారు.