ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. మాజీ మంత్రి హరీష్ దిగ్భ్రాంతి

62பார்த்தது
ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. మాజీ మంత్రి హరీష్ దిగ్భ్రాంతి
TG: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని జాలిగామ బైపాస్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మృతులను కోడూరు, గాడిచర్లపల్లికు చెందిన పరందాములు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కానిస్టేబుళ్ల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కానిస్టేబుళ్ల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி