ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించాలన్న ఫార్ములా-ఈ కారు రేసు ఉద్దేశం చిల్లర రాజకీయాలు చేసేవారికి తెలియదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేసినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రయత్నించానని ఓ వీడియో షేర్ చేశారు.