ఆధునిక సాంకేతికతకు పర్యాయపదంగా నిలిచే జపాన్ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. తాజాగా ఓ విదేశీయురాలు అక్కడ ఓ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించి అబ్బురపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పరిమిత సంఖ్యలో సర్వీసులు ఉండే ఈ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పేరు సెఫ్ఫైర్ ఒడోరికో. టోక్యో, ఇజుల మధ్య చెక్కర్లు కొట్టే ఈ రైలు ప్రయాణం స్వర్గాన్ని తలపిస్తుంది.