యూపీలోని గ్రేటర్ నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ రోడ్డులో ప్యాసింజర్ వ్యాన్ ఆగింది. అదే సమయంలో కొందరు పాదచారులు సైతం ఆ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సకాలంలో అక్కడి నుంచి పక్కకు వారంతా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది