విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి

70பார்த்தது
విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి
AP: అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం మండలం జి.కోడూరులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మృతులను కోయిలాడ కాంతం, వేగి వేముడు గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி