ఉత్తరప్రదేశ్‌లోని సంత్కబీర్‌నగర్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ చెరువులో పడింది. ఈ ప్రమాద ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానిక ప్రజల సహాయంతో చెరువులో నుండి కూలీలను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.