అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించి నేటికి వందేళ్లు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న ఆయన జన్మించారు. తల్లి కృష్ణదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజ్‌పేయి. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన కవి కూడా. వాజ్‌పేయి పాత్రికేయుడిగానూ విధులు నిర్వర్తించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన ఆయన 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారు.