షిర్డీ సాయిబాబా మహిమ అపరిమితమైనదని భక్తుల విశ్వాసం. ఆయన ఎప్పుడూ కులం, మతం లేదా జీవుల మధ్య వివక్షత చూపలేదు. ఎవరైతే భక్తితో సాయిబాబాని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు అంటారు. గురువారాల్లో ఉపవాసం ఉండటం వల్ల సాయి ప్రత్యేక అనుగ్రహం తన భక్తులపై కురుస్తాడు. సాయిబాబా ఎప్పుడూ 'సబ్ కా మాలిక్ ఏక్ హై ' అనే సందేశాన్ని ఇచ్చేవారు. అయితే ఇప్పుడు సాయిబాబా గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ షిర్డీ సాయిబాబా జయంతి.