భారతదేశం గర్వించే వీరుడు, విప్లవకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి నేడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జన్మించారు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్ని! ఏడవొద్దు, నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.