ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్
అంబానీ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి టీనా
అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన కేసుకు సంబంధించి ఆమె ఈడీ ఎదుట హాజరయ్యారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం (ఫెమా)లోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్
అంబానీ వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన భార్య టీనా నేడు ఈడీ విచారణకు వెళ్లారు.