ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాల ఏర్పాటుకు అధికారులు నోటిఫై చేశారు. మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ. 1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది.