గజగజ వణికించే చలిలోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేవలం టీ షర్ట్ ధరిస్తుంటారు. దీనిపై ఆయన గతంలో మాట్లాడుతూ, "నేను మధ్యప్రదేశ్ జోడోయాత్రలో ఉన్నప్పుడు నా వద్దకు చిరిగిన బట్టలతో ముగ్గురు పేద ఆడపిల్లలు వచ్చారు. వారు చలితో వణికిపోతున్నారు. నాకూ చలితో వణుకొచ్చే వరకు టీషర్టే ధరించాలని ఆరోజు నిర్ణయించుకున్నా." అని చెప్పారు. ఆ అమ్మాయిలకు స్వెటర్ అందుబాటులో ఉన్న రోజు, నేనూ స్వెటర్ ధరిస్తాను రాహుల్ అని తెలిపారు.