బాహుబలి లాంటి తెలంగాణను బలిచేసి, కాంగ్రెస్ నంగనాచి మాటలు మాట్లాడుతోందని KTR విమర్శించారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా అని KTR ట్వీట్ చేశారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అని ఘాటు విమర్శలు చేశారు. ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా అని KTR ఫైర్ అయ్యారు.