కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలివచ్చిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. గురువారం సినీ ప్రముఖులతో భేటీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్దామని పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో సినీ పరిశ్రమ కలిసి రావాలని పిలుపునిచ్చారు.