TG: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. ధూల్‌పేటలో ప్రారంభమైన శోభయాత్ర కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.2 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. 'జై శ్రీరామ్!.. జై శ్రీరామ్!' అనే నామస్మరణతో నగర వీధులు మార్మోగిపోతున్నాయి. నగర నలుమూలల నుంచి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఈ రమణీయ ఘట్టంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.