మహిళ ఫోన్ చోరికి యత్నించిన వ్యక్తికి దేహశుద్ది.. వీడియో

52பார்த்தது
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ సెల్ ఫోన్‌ని చోరికి యత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ది చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ మహిళ ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురుగా వచ్చిన దొంగ మహిళ చేతిలోని ఫోన్ లాక్కొని పారిపోయాడు. వెంటనే స్థానికులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

தொடர்புடைய செய்தி