హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉంది. ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేదినుంచి 28వ తేదీ వరకు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ వివరించారు.