మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన.. గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారు. ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు విశేషంగా కృషి చేశారు." అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము, జగదీప్ ధన్‌ఖడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.