దేశంలో వరుస పేపర్ లీక్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జార్ఖండ్‌లో టెన్త్ బోర్డు పరీక్షల పేపర్స్ లీకయ్యాయి. ఆ ప్రశ్నాపత్రాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ 10వ తరగతి హిందీ, సైన్స్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే హిందీ పరీక్ష ఫిబ్రవరి 18న జరుగగా, సైన్స్ పరీక్ష ఫిబ్రవరి 20న జరగాల్సి ఉంది.