సూర్యాపేట జిల్లాలో తుఫాను కారణంగా తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండల ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకి రావాలని సీఐ శ్రీనివాస్ నాయక్ శనివారం తెలిపారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెరువుల వద్దకు చేపల వేటకు వెళ్లొద్దని, కరెంటు స్తంభాలను తాకరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అత్యవసర సమయంలో100కు కాల్ చేయాలని సిఐ సూచించారు.