కస్తూరిబా బాలికల విద్యాలయంలో క్రీడా వస్తువులు అందజేత

1611பார்த்தது
కస్తూరిబా బాలికల విద్యాలయంలో క్రీడా వస్తువులు అందజేత
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ (4 టైమ్స్), రచయిత, సమాజ సేవకులు, ప్రముఖ కళాకారులు డా. పెండెం కృష్ణకుమార్ శనివారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయము (కెజిబివి) చివ్వేంల నందు చదువుల దేవి సరస్వతీ దేవి, మన దేశానికి ఎనలేని సేవలు చేసిన స్వాతంత్ర సమరయోధులు, చరిత్ర కారులు, సంఘసంస్కర్తల చిత్రపటాలు కస్తూరిబా గాంధీ కాళోజి, సావిత్రిబాయి పూలే, సర్వేపల్లి రాధాకృష్ణ, మదర్ తెరిసా, సివి రామన్, శ్రీనివాస రామానుజన్, నెహ్రు, రుద్రమదేవి, ప్రొఫెసర్ జయశంకర్ మొదలగు చిత్రపటాలను పాఠశాలకు అందించడంతోపాటు వాలి బాల్, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డ్స్, మల్టీ గేమ్ బోర్డ్స్, మెడికల్ కిట్, గోడ గడియారం, డ్రాయింగ్ పెన్సిల్స్, రబ్బర్స్, చాక్ మరలు, పెన్నులు వాటర్ క్యాన్ మరియు క్లాత్ బ్యాగ్స్ మొదలకు సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి మాట్లాడుతూ దాత డా, , పెండెం కృష్ణ కుమార్ చేస్తున్న విద్య, వైద్యం, క్లాత్ బ్యాగ్ ల వాడకం, నీటి పొదుపు, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటి సంరక్షణ వంటి కార్యక్రమము లు గత 30 సంవత్సరాలుగా అనేక సేవలందిస్తూ తన సొంత నిధులతో ఎంతో మందిని ఆదుకోవడం ప్రభుత్వ పాఠశాలల యందు జాతీయ నాయకుల చిత్రపటం, సరస్వతి దేవి చిత్రపటాలను, గోడ గడియారంలు, ఇండోర్ ఔట్ డోర్ ఆట వస్తువులు , వాటర్ క్యాన్స్, మెడికల్ కిట్స్, నోట్ బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ , టేబుల్స్, కుర్చీలు, అందుల పాఠశాలల నందు బ్రెయిలీ స్లేట్స్, మ్యాథమెటిక్స్ స్లేట్స్, స్టిక్స్, డెఫ్ అండ్ డం విద్యార్థుల కొరకు చాక్ పీస్, క్యాండిల్ యంత్రాలు, మానసిక వికలాంగులకు వృత్తి ఒకేషనల్ కోర్సు యంత్రంలు, అనాధ ఆశ్రమాల నందు గ్రాసరి కిస్ అవసరమైన విలువైన వస్తువులను బీరువాలు పాఠశాల సంబంధించిన సామగ్రిని ఎన్నో వస్తువులను ఉచితంగా అందించారు.

మన భారత దేశంలో అక్షరాస్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎన్నో పాఠశాలల్లో దేశభక్తి పెరగడం కోసం పాటుపడుతున్నారు. అంతేకాకుండా చలివేంద్రాలు అన్నదానాలు, మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరాలు, బీపీ షుగర్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, మందులు ఉచితం గా ఇవ్వడం అనాధాశ్రమం లో కిట్స్, హాస్పిటల్లో వీల్ చైర్స్ ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. కోవిడ్ సమయంలో అన్న దానాలు, గ్రాసరి కిట్లు, సానిటీజర్స్, మాస్క్ లు, మెడిసిన్ మొదలగు సామగ్రి అందచేశారు.

ఎలాంటి ఆడంబరాలు లేకుండా అనాధ ఆశ్రమం లో పుట్టినరోజు జరుపుకుంటారు. ఇవే కాక నాలుగు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మూడు వందల పాత్రలు ప్రపంచంలో ఎవరు చేయని విధంగా విధంగా రికార్డులకెక్కి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు సొంతంగా సుమారు 30 వేల వరకు తను సొంతంగా తయారు చేయించి వాటి పై మంచి కొటేషన్ లతో నీటిని పొదుపు చేయడం మొక్కలు నాటడం అనే కాన్సెప్ట్ తో ప్లాస్టిక్ వాడకుండా తన సొంత నిధులతో ఇవ్వడం జరిగింది ఇంకా జరుగుతుంది. మొక్కలు నాటడం విద్యా వైద్య రంగాల్లో మన దేశం ముందుండాలనే లక్షల తో ఎన్నో సేవలను అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి టీచర్లు కమలాక్షి, పూలమ్మ, , ఆయేషా, గోదాకృష్ణ, సబిత, జ్యోతి, శోభ రాణి, మంజుల, నీల, నీరజ, లోలిత ప్రియాంక, సంధ్య రాణి, రజిత మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி