తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ కోదండరాం అనడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ సమావేశంలో కోదండరాం మాటలను స్వాగతిస్తున్నామని, ఉద్యమం చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరుగుతుందన్నారు.