కోదాడ పట్టణంలోని కట్ట కొమ్ముల గూడెం రోడ్డులో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల స్కిల్ టెస్ట్ ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు కెఎల్ఎన్ ప్రసాద్ కాటమయ్య రక్షణ కవచాల పంపిణీకి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 60 శాతం మందికి కెఎల్ఎన్ ప్రసాద్ లైసెన్సులు మంజూరు చేయించారన్నారు. లైసెన్సులు లేని వారు, వారి దృష్టికి తేవాలన్నారు.