సూర్యాపేటలో జరిగే టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభలకు కోదాడ డివిజన్ నుండి ఆ సంఘం నాయకులు బాధ్యులు ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల నుండి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా మహాసభల్లో విద్యారంగ సమస్యలపై చర్చించి ప్రత్యేక కార్యచరణ ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా అధ్యక్షుడు ధన మూర్తి, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.