అనంతగిరి, కోదాడ మండలాల్లోని వరద బాధిత గ్రామాలు కూచిపూడి గొండ్రాల, కిష్టాపురం, చనుపల్లి, రెడ్ల కుంట, మాధవరంలల్లో బీజేపీ ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి పురుషోత్తం, అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు.