భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించిన పెడకం బాలరాజు ఐదేళ్ల క్రితం మృతి చెందారు. తండ్రిపై ప్రేమతో ఆయన కుమార్తె స్నేహ తండ్రి విగ్రహాన్ని చేయించి తన వివాహ రిసెప్షన్ వేడుకకు తీసుకువచ్చారు. ఆయన తమ మధ్య ప్రత్యక్షంగా లేకపోయినా విగ్రహ రూపంలో చూసుకుని కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.