10:00 - రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్ వద్దకు పెరిగిన భక్తుల తాకిడి. శ్రీపద్మావతి పార్కులోకి అనుమతి.
2:00 - భక్తులతో నిండిన పార్కు. అదుపు చేసేందుకు భారీగా పార్కు వద్దకు చేరిన పోలీసులు.
7:00 - పూర్తిగా పార్కు నిండిపోవడంతో ఎటూ కదలలేని పరిస్థితి.
8:20 - భారీగా పెరిగిన రద్దీ. పార్కు నుంచి టికెట్ల జారీ కౌంటర్‌లోకి అనుమతి. ఈ క్రమంలో భక్తుల మధ్య తోపులాట. పలువురు కింద పడగా.. వారిపై నుంచి భక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం చోటు చేసుకుంది.