ప్రెగ్నెన్సి రూమర్స్ పై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించారు. తాను బరువు మాత్రమే పెరిగానని, ఇంకా గర్భం దాల్చలేదని వెల్లడించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఇంకా ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. తమకు పెళ్లె నాలుగు నెలలే అయిందని, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. కాగా గత జూన్ లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను సోనాక్షీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.