మనం రోజు ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్లు కాలేయానికి ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే నీరు త్రాగడం మార్చిపోకూడదని చెబుతున్నారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఉదయం పూట నీరు త్రాగడం వల్ల శరీరంలో నీటి కొరతను అది భర్తీ చేస్తుంది. అలాగే కాలేయంలోని విషపూరిత మూలకాలు తొలగిపోతాయి. ఉదయాన్నే వేయించిన లేదా కొవ్వు పదార్ధాలను తినకూడదు. ఇవి కాలేయ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి.