సిట్ అధికారులు ఏయే అంశాలపై విచారిస్తారంటే..

58பார்த்தது
సిట్ అధికారులు ఏయే అంశాలపై విచారిస్తారంటే..
నెయ్యి తిరుమలలోని గోదాముకు చేరుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు? నాణ్యత పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిల్స్‌ తీసుకుంటారు? అనే విషయాలను సిట్ అధికారులు తెలుసుకోనున్నారు. ల్యాబ్‌కు పంపిన తర్వాత ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు? ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు?. టెెండరులో పాల్గొనే కాంట్రాక్టు సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? ఆ సంస్థలను ఎలా ఎంపిక చేస్తారు? రివర్స్‌ టెండరింగ్‌ ఎలా జరుగుతుంది వంటి వివరాలపై ప్రొక్యూర్‌మెంట్‌ విభాగాధికారుల నుంచి వివరాలు తీసుకుంటారు.

தொடர்புடைய செய்தி