కుక్కల గుంపుతో ఇక్కట్లు

67பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాత్రి సమయాల్లో కుక్కల గుంపులు పట్టణవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కుక్కల వలన ప్రయాణికులు పట్టణంలో పలు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ, అరుస్తూ ఉండడంతో నిద్ర పట్టడం లేదని పలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా పలువురు చిన్నారులు కుక్క కాటుకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி