మిడ్ మానేర్ భూ నిర్వాసితుల యొక్క సమస్యల పరిష్కారంలో నాటి ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ అన్నారు. నేటి ప్రభుత్వం కూడా అదే వైఫల్యాలను కొనసాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు స్పందించి ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.